Wednesday, December 2, 2009

ఎప్పుడు చేద్దాం యుద్ధం?


పొద్దున్నే లేవటం బద్దకం
లేచినా స్నానం చెయ్యటం బద్దకం

ఆరోగ్యంగా ఉండాలంటే బద్దకం
ఉండాలని ఉన్నా వ్యాయామం చెయ్యటం బద్దకం

ఆఫీసుకి వెళ్ళటం బద్దకం
వెళ్ళినా పని చెయ్యటం బద్దకం

కలలు కనటం బద్దకం
అవి కన్నా సాధించడం మరీ బద్దకం

పక్క వాణ్ని మెచ్చుకోవటం బద్దకం
మెచ్చుకున్నా, ఆ లక్షణం అలవర్చుకోవటం బద్దకం

సెలవు వచ్చిందంటే ఇల్లు కదలటం బద్దకం
కదిలినా మళ్లీ ఇంటికి రావాలంటే బద్దకం

మనకోసం మనం ఆలోచన చేయటం బద్దకం
చేసినా, మనం ఏమి చేయగలం అనే బద్దకం

గ్లాసు నీళ్ళు తెచ్చుకోవటం బద్దకం
తెచ్చే వారుంటే అందుకోవటం బద్దకం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

ఏమి చేసాం, ఏమి చేసాం అని వెనుదిరిగి చూస్తే
అంతా శూన్యం.. అంతా శూన్యం

బద్దకం అనే పునాది మీద
ఏది నిలబడుతుందో
ఏది తడబడుతుందో

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

ఉదయం... మధ్యాహ్నం అయ్యింది
మధ్యాహ్నం... సాయంత్రమయ్యింది
సాయంత్రం... చీకటయ్యింది
చీకటి మళ్లీ తెల్లారింది
చేసిందేమిటి అంటే....
అంతా శూన్యం.. అంతా శూన్యం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

చిన్నతనం ...కౌమారమయ్యింది
కౌమారం కుర్రతనమయ్యింది
కుర్రతనం పెద్దయ్యింది
మరి ఇంత కాలం పొడిసింది ఏమిటంటే....
అంతా శూన్యం.. అంతా శూన్యం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

తెల్ల వాళ్ళను తరిమి కొట్టాం
మరి ఇంటి దొంగని ఎందుకు వదిలి పెట్టాం

బానిస బ్రతుకు వద్దనుకున్నాం
మరి ఇపుడు ఏంచేస్తున్నాం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం..

నేను సిద్ధం... నేను సిద్ధం...నేను సిద్ధం


------------------------------------------------------------------------------

3 comments:

  1. బద్దకం మీద యుద్ధమనే నీ ఆలోచనా దానిని వివరించిన తీరు చాలా బావుంది.

    ReplyDelete