కొక్కొరొకో...

Friday, December 25, 2009

ఎలా వస్తుంది?

.
రాయటం ఎలా వస్తుంది
రాస్తూ ఉ౦డటం వలన
.
జ్ఞానం ఎలా వస్తుంది
ప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన
.
శక్తి ఎలా వస్తుంది
నిన్ను నువ్వు నమ్మడం వలన
.
మార్పు ఎలా వస్తుంది
మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన
.
నేర్పు ఎలా వస్తుంది
సాధన చేస్తూ ఉ౦డటం వలన
.
తెగింపు ఎలా వస్తుంది
తర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన
.
గమ్యం ఎలా చేరువవుతుంది
నీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన
.
కీర్తి ఎలా వస్తుంది
చేస్తున్న ప్రతి పనిని క్రీడగా భావించడం వలన
.
సంతృప్తి ఎలా వస్తుంది
నీ హృదయాన్ని పూర్తిగా నమ్మడం వలన
.
.

Tuesday, December 8, 2009

మనసు - మగువమనసు మాట వినదు
మగువ మనసు విప్పదు 

మౌన౦ చేరువ చెయ్యదు
ఆశ ఆవిరి అవ్వదు

చెలియ చెంతకు చేరదు
చొరవ చేయక తప్పదు!   


--------------------------------------------------------------------------------------

Monday, December 7, 2009

ఎదురు లేదుఎదురు లేదు తిరుగు లేదు
మడం తిప్పే ప్రసక్తే లేదు
నిన్న లేదు రేపు లేదు
ప్రస్తుతానికి మించిన బహుమతి లేదు

అలుపు లేదు సొలుపు లేదు
మలుపలంటే భయం లేదు 
భీతి లేదు బ్రాంతి లేదు
ఓటమంటే  ద్వేషం లేదు

పగ లేదు పంతం లేదు
స్నేహానికన్నా సత్యం లేదు
కులం లేదు మతం లేదు
ప్రేమ కన్నా హితం లేదు


------------------------------------------------------------------------

Wednesday, December 2, 2009

నిరూపిద్దాం....నిరూపిద్దాం 
కలలు అన్నీ చెదిరి పోవని 
కల కోసమే జీవితమని
మన కలలు ఎప్పుడు కళ తప్పవని 

మన కలంతో నిరూపిద్దాం

మనలోని సామాన్యుడికి సన్యాసమిచ్చి

జనం పిచ్చికి మందు ఇచ్చి
మనలోని మనిషిని అబ్బురపరచి 

మనమేంటో నిరూపిద్దాం

ఊపిరున్నది ఊహించటానికేనని

ధైర్యమున్నది దానిని దక్కించుకోవటానికేనని
పిరికితనం మన బానిసని 

మడం తిప్పడం చేతకాదని నిరూపిద్దాం

బ్రతుకు అంటే భయం కాదని

భయం ఉంటే అది బ్రతుకు కాదని
నిన్ను నువ్వు తెలుసుకొనుటే జ్ఞానమని

నిన్ను నువ్వు గెలుచుకొనుటే విజయమని నిరూపిద్దాం

ఇంత బ్రతుకు చివరికి మట్టిలోనే అని

మెట్టు మెట్టుకి సంతృప్తే ముఖ్యమని
సోమరికి చరిత్రలో చోటే లేదని

లోకంలో మిగిలేది గట్టి వారేనని నిరూపిద్దాం

ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదని
కష్టం అంటే కల్పితమేనని
నిరూపిద్దాం....నిరూపిద్దాం

జీతం కన్నా జీవితం ముఖ్యమని
ఆస్థి కన్నా అస్తిత్వం మిన్న అని                                        నిరూపిద్దాం....నిరూపిద్దాం

రాతలు మార్చేది రాముడు కాదని
గీతలు మార్చేది గోవిందుడు కాదని
నిరూపిద్దాం....నిరూపిద్దాం

మన ఉహలే మన గీతలని
మన చేతలే మన రాతలని
నిరూపిద్దాం....నిరూపిద్దాం -----------------------------------------------------------

ఎప్పుడు చేద్దాం యుద్ధం?


పొద్దున్నే లేవటం బద్దకం
లేచినా స్నానం చెయ్యటం బద్దకం

ఆరోగ్యంగా ఉండాలంటే బద్దకం
ఉండాలని ఉన్నా వ్యాయామం చెయ్యటం బద్దకం

ఆఫీసుకి వెళ్ళటం బద్దకం
వెళ్ళినా పని చెయ్యటం బద్దకం

కలలు కనటం బద్దకం
అవి కన్నా సాధించడం మరీ బద్దకం

పక్క వాణ్ని మెచ్చుకోవటం బద్దకం
మెచ్చుకున్నా, ఆ లక్షణం అలవర్చుకోవటం బద్దకం

సెలవు వచ్చిందంటే ఇల్లు కదలటం బద్దకం
కదిలినా మళ్లీ ఇంటికి రావాలంటే బద్దకం

మనకోసం మనం ఆలోచన చేయటం బద్దకం
చేసినా, మనం ఏమి చేయగలం అనే బద్దకం

గ్లాసు నీళ్ళు తెచ్చుకోవటం బద్దకం
తెచ్చే వారుంటే అందుకోవటం బద్దకం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

ఏమి చేసాం, ఏమి చేసాం అని వెనుదిరిగి చూస్తే
అంతా శూన్యం.. అంతా శూన్యం

బద్దకం అనే పునాది మీద
ఏది నిలబడుతుందో
ఏది తడబడుతుందో

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

ఉదయం... మధ్యాహ్నం అయ్యింది
మధ్యాహ్నం... సాయంత్రమయ్యింది
సాయంత్రం... చీకటయ్యింది
చీకటి మళ్లీ తెల్లారింది
చేసిందేమిటి అంటే....
అంతా శూన్యం.. అంతా శూన్యం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

చిన్నతనం ...కౌమారమయ్యింది
కౌమారం కుర్రతనమయ్యింది
కుర్రతనం పెద్దయ్యింది
మరి ఇంత కాలం పొడిసింది ఏమిటంటే....
అంతా శూన్యం.. అంతా శూన్యం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...

తెల్ల వాళ్ళను తరిమి కొట్టాం
మరి ఇంటి దొంగని ఎందుకు వదిలి పెట్టాం

బానిస బ్రతుకు వద్దనుకున్నాం
మరి ఇపుడు ఏంచేస్తున్నాం

మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం...
మరి ఎప్పుడు చేద్దాం యుద్ధం..

నేను సిద్ధం... నేను సిద్ధం...నేను సిద్ధం


------------------------------------------------------------------------------

ఎవరు మీరు?


సోము - సుబ్బారావు - ధీరు

వీరిలో ఎవరు మీరు ?

సోము:

ఈయనకి లెగడమే మహా బద్ధకం
జీవితం అంతా మత్తులోనే గడిపేస్తాడు
సోమూని చూడగానే ఈజీగా గుర్తు పట్టొచ్చు...ఎందుకంటే అధిక బరువు లేక ఊబకాయంతో బాధపడుతూ.. తన శరీరాన్ని బాధపెడుతూ ఉంటాడు
పనిని ఎలా వాయిదా వెయ్యొచ్చో ఈయనకి బాగా తెలుసు
అందులో సోము Phd కూడా చేసాడు.
కష్టపడేవారిని చూసి జాలి పడతాడు
సోము ఎక్కువగా ఉపయోగించే పదాలు: ఆకలి, నిద్ర, నీరసం
పని అంటే పారిపోతాడు
లేదంటే నిద్రపోతాడు
చాలామంది పని దొరక్క ఏడుస్తుంటారు
వీడు పనుంటే ఏడుస్తాడు
అసలు వీడికి తిండి మీదా మంచం మీద ఉన్న ఆసక్తి ప్రపంచంలో దేని మీద ఉండదు

సోము తరచుగా వాడే వాక్యాలు:
"నా వల్ల కాదు"
"ఆ!! నిద్రొస్తోంది... "

సుబ్బారావు:

ఈయన మీకు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాడు
అతి సామాన్యుడు.
జీవితాన్ని ఏడుస్తూ.. ఈడుస్తూ..... బ్రతికేస్తుంటాడు
వదులు కోవటం లో ఆనందాన్ని పొందేస్తూ ఉంటాడు
ఈయనికి శరీరం మీద శ్రద్ద వుంటుంది...కానీ అప్పుడప్పుడు మాత్రమే.
ఒకోసారి లావుగా, ఇంకోసారి సన్నగా, మరోసారి మాములుగా కనిపిస్తూ ఉంటాడు
ఈ మార్పులన్నీ తన మీద తనకి మానసికంగా పట్టు లేదని నిరూపిస్తూ వుంటాయి
సుబ్బారావు డిక్షనరీ లోనుంచి తీయలేని పదాలు 'భయం' & 'రాజీ'
అలాగే ఇతని డిక్షనరీ లో దేవుడు దిగి వచ్చినా చేర్చలేని పదం 'ధైర్యం'
ప్రతిదానికీ ఎడ్జెస్ట్ అయిపోవటం బాగా అలవాటు
అది జీతమైనా... జీవితమైనా...
సుబ్బారావుకి స్నేహితులెక్కువే
కాకపొతే అన్నీ పనికిరాని స్నేహాలే
ఫ్రెండ్స్ ఇంట్లో ఫంక్షన్లకు వెళతాడు
ప్రేమతో కాదు, రిలేషన్ ఎక్కడ పోతుందో అన్న భయం తో
ఈయనకి మరో క్వాలిటీ ఉందండోయ్
అదే...అదే... అదేనండి....మొహమాటం!
ఈయన అదేదో పెద్ద క్వాలిఫికేషన్లా ఫీల్ అయిపోతుంటాడు
అసలు సుబ్బారావు సమయం అంతా మొహమాటంతోనే మాయం అయిపోతుంటుంది
కాలం కర్పూరమైపొతున్నా...ఆ జ్ఞానం మాత్రం ఈయనకి బోధపడదు.
ఎప్పుడూ పక్క వాళ్ళు గెలుస్తుంటే
చూసి గంతులేస్తాడు తప్పితే
అలా నేనుందుకు గెలవలేను అని ఆలోచించడు
జీవితాంతం గొప్పవాళ్ళను పొగుడుతూ గడిపేస్తాడు తప్పితే
వాళ్ళు చేసింది ఒక్కటైనా అలవాటుగా మార్చుకోడు
మార్పు అంటే ఇతని దృష్టిలో పెను ముప్పు అని అర్థం
చేస్తున్న ఉద్యోగం ఇష్టం లేక పోయినా...చేస్తూనే వుంటాడు
పనిలో ఆనందం ఆవిరైపోయినా...ఆవురమంటూ గడిపేస్తాడు
ఈ పని నాకు ఇష్టం లేదని పదిమందితో పదే పదే అంటాడు
కాని తెల్లారితే మళ్లీ అదే పనిలో మూలుగుతూ వుంటాడు

సుబ్బారావు తరచుగా వాడే వాక్యాలు:
"ఆ.. మన జీవితాలింతే"
"దేనికైనా అదృష్టం ఉండాలి"
"అవన్నీ మనవల్ల అవుతాయా"

ధీరు:

ఇతనికి ఆకాశమే హద్దు
ఇతని నిఘంటువు
'కలలు', 'సాహసం',
'శోధించడం', 'సాధించటం' లాంటి పదాలతో నిండిపోయి ఉంటుంది.
మనసు మీద, శరీరం మీద మంచి పట్టు ఉంటుంది.
చూడగానే ఆకట్టుకొనే శరీరాకృతి, చెదరని చిరుమందహాసం ఇతని ఆభరణాలు.
ధీరుకి పుట్టుకతోనే ఆ శరీరాకృతి వచ్చిందనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే
కేవలం అతని సంకల్పం తోనే దాన్ని సాధించాడు.
చిన్నపట్నించి తన దగ్గర ఉన్నవి ఎలా అభివృద్ధి చేసుకోవాలో
లేనివి ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు
వజ్ర సంకల్పం ఇతని వరం
ధీరుకి తన ఇష్టాలేంటో,
రాబోయే కష్టాలేంటో,
తన సత్తా ఏంటో,
తనలోని లోపాలేంటో కచ్చితంగా తెలుసు
ఇతనికంటే ఇతని పనే ఎక్కువ మాట్లాడుతూ వుంటుంది
సమయాన్ని గౌరవిస్తాడు
తనకి తాను మంచి స్నేహితుడు
విజయం ఇతనికి చాలా దగ్గర బంధువు

ధీరు తరచుగా వాడే వాక్యాలు:
"నిన్ను నువ్వు నమ్ముకో"
"ఏదీ అసాధ్యం కాదు"

P.S:

ఇదండీ ఈ ముగ్గురి కథ
ఈ ముగ్గురిని వివరించటం లో నా ఉద్దేశ్యం సామాన్యుని కించపరచటం కాదు
ప్రతి వ్యక్తిలోను ఈ మూడు పార్శ్వాలు ఉంటాయి. కాకపోతే మనం ఎంత తొందరగా ఈ మెట్లు ఎక్కుతామన్నది మనలోని గొప్పతనం మీద ఆధారపడుతుంది.
ఒక్కో సమయంలో మనలో సోము డామినేట్ చెయ్యొచ్చు లేకపోతే సుబ్బారావు స్పందిచవచ్చు. ఒకే రోజులో ఈ ముగ్గురూ మనలో ప్రవేశించవచ్చు.
విషయం ఏంటంటే మనకి పాతికేళ్ళు వచ్చేసరికి సోము, సుబ్బారావు మనకి చాలా పాత స్నేహితులైపోవాలి లేదంటే మన జీవితం గందరగోళం, మన కలలు కర్పూరం
ధీరు ఎంత దగ్గరైతే మనం గెలుపుకి అంత దగ్గరవుతాం
ఇప్పుడు చెప్పండి మీలో ఎవరెవరు ఎంత శాతం

నాకైతే ప్రస్తుతానికి
సోము: 15%
సుబ్బారావు: 50%
ధీరు: 35%

అతి తొందర్లో పూర్తిగా ధీరు లో కలిసిపోవాలిని ప్రయత్నిస్తున్నాను
ఇక మీ స్కోరు కోసం ఎదురు చూస్తుంటాను

ఇట్లు
హితుడు
అజయ్ వేగేశ్న


------------------------------------------------------------------------------

బిర్యాని బిర్యాని

A Tribute to Biryani by ajaY vegeSna


సామాన్యుడు మెచ్చేది
మందు బాబులు పడి చచ్చేది
బిర్యాని.....బిర్యాని

వర్షం వస్తే గుర్తొచ్చేది
పార్టీ అనగానే మదిలో మెదిలేది
బిర్యాని.....బిర్యాని

పక్కవాడి ప్రమోషన్ అయినా
వీధి చివర ఫంక్షన్ అయినా
బిర్యాని.....బిర్యాని

సభకు జనం రావాలన్నా
నాయకులు  వర్దిలాలన్నా
బిర్యాని.....బిర్యాని

పాత స్నేహితుడు వచ్చినా
కొత్త స్నేహం చిగురించినా
బిర్యాని.....బిర్యాని

వీకెండు వచ్చినా
గర్ల్ ఫ్రెండ్ మెచ్చినా
బిర్యాని.....బిర్యాని

పేద వాడికైనా
పెద్దరాజు కైనా
బిర్యాని.....బిర్యాని

పిల్ల వాడి కైనా

వాడిని కన్న వారికైనా
బిర్యాని.....బిర్యాని

మ్యాచ్ విన్ అయినా
క్యాచ్ మిస్ అయినా
బిర్యాని.....బిర్యాని

మూడ్ డల్ అయినా
మనసు థ్రిల్ అయినా
బిర్యాని.....బిర్యాని

గుడ్ న్యూస్ విన్నా
ఫ్లాష్ న్యూస్ అయినా
బిర్యాని.....బిర్యాని

మనవాళ్ళు గెలిచినా
పక్కవాళ్ళు ఓడినా
బిర్యాని.....బిర్యాని
 

వెకేషన్ అయినా
ఏ అకేషన్ అయినా
బిర్యాని.....బిర్యాని

అల్సర్లు వచ్చినా
గ్యాస్ట్రిక్ వచ్చినా
బిర్యాని.....బిర్యాని

నాలుక రుచి కోరినా
నోరు చప్ప బడినా
బిర్యాని.....బిర్యాని

కులం లేదు మతం లేదు
క్లాసు మాసు తేడా లేదు
బిర్యాని.....బిర్యాని

ఇంత మందిని కలిపావు
మన వంట ఖ్యాతిని తెలిపావు
బిర్యాని.....బిర్యాని

బిజినెస్లు పెంచావు
నిరుద్యోగం తుంచావు
బిర్యాని.....బిర్యాని

తినే వరకు ఒక తంటా
తిన్నాక కడుపులో మంట
ఐనా మానరే.. ఏ జంటా
బిర్యాని.....బిర్యాని

ఏ బ్రాండు మందైనా
ఏ గ్రాండు విందైనా
నీ ట్రెండు మారునా
బిర్యాని.....బిర్యాని

(ఎంత వారలైన బిర్యాని దాసులే)------------------------------------------------------------------------------