Friday, December 25, 2009

ఎలా వస్తుంది?

.
రాయటం ఎలా వస్తుంది
రాస్తూ ఉ౦డటం వలన
.
జ్ఞానం ఎలా వస్తుంది
ప్రశ్నను కూడా ప్రశ్నించడం వలన
.
శక్తి ఎలా వస్తుంది
నిన్ను నువ్వు నమ్మడం వలన
.
మార్పు ఎలా వస్తుంది
మలుపులను సైతం ప్రేమిస్తూ ఉ౦డటం వలన
.
నేర్పు ఎలా వస్తుంది
సాధన చేస్తూ ఉ౦డటం వలన
.
తెగింపు ఎలా వస్తుంది
తర్కాన్ని మదిస్తూ ఉ౦డుటవలన
.
గమ్యం ఎలా చేరువవుతుంది
నీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన
.
కీర్తి ఎలా వస్తుంది
చేస్తున్న ప్రతి పనిని క్రీడగా భావించడం వలన
.
సంతృప్తి ఎలా వస్తుంది
నీ హృదయాన్ని పూర్తిగా నమ్మడం వలన
.
.

6 comments:

  1. మీ టపా చాలా బాగు౦ది.

    ReplyDelete
  2. బాగుంది.

    ReplyDelete
  3. కవిత చాలా బావుందండి. చిన్న కవితలో మొత్తం జీవితాన్ని చెప్పేసారు. రచనా శైలి, మీ భావాన్ని భాషగా మార్చి పరిగెట్టించిన విధానం ప్రశంసనీయం.

    ReplyDelete
  4. గమ్యం ఎలా చేరువవుతుంది
    నీ దిశను గమనిస్తూ ఉ౦డటం వలన

    Super... :-) Hats off.

    ReplyDelete
  5. Great ajay garu very nice.This is kranthi gurtu pattara.chaala baga rastunnaru keep it up.

    ReplyDelete
  6. అజయ్ గారూ,
    రాజన్ గారి బ్లాగులో మీ"కొక్కొరొక్కో" చూసినప్పట్నుంచీ రోజూ మీ బ్లాగు చదుదాం అనుకుంటా..కాని అలానే పోయింది...ఇప్పుడే అన్నీ చదివా...చదుతుంటే ఎందుకొచ్చావ్ ఈ బ్లాగుకి అని నా మనసు వెనక్కి లాగుతూనే ఉంది....ఎందుకంటే దానికి భయం పట్టుకుంది,దాని చిరకాల మిత్రులైన సోమరితనం,బద్దకాల్ని నేనెక్కడ బయటకి తరిమేస్తానో అని....కాని నా లోపలెక్కడో నిద్రోతున్న బుద్ధ్హి ఉలిక్కిపడి లేచి,నా మనసు చేతులు కట్టేసి,నోరు నొక్కేసి మరీ చదివించింది...రేపు లేవగానే ఇంక పాపం దాని పాతమిత్రులు కనపడకపోతే అదేం చేస్తుందో చూడాలి...గోల పెడుతుందో లేకపోతే అసలు స్నేహం బుద్ధ్హి మాటవిని బుద్ధ్హిగా నడుచుకుంటుందో...

    ReplyDelete