Showing posts with label Telugu Blogs. Show all posts
Showing posts with label Telugu Blogs. Show all posts

Wednesday, December 2, 2009

నిరూపిద్దాం....నిరూపిద్దాం



 
కలలు అన్నీ చెదిరి పోవని 
కల కోసమే జీవితమని
మన కలలు ఎప్పుడు కళ తప్పవని 

మన కలంతో నిరూపిద్దాం

మనలోని సామాన్యుడికి సన్యాసమిచ్చి

జనం పిచ్చికి మందు ఇచ్చి
మనలోని మనిషిని అబ్బురపరచి 

మనమేంటో నిరూపిద్దాం

ఊపిరున్నది ఊహించటానికేనని

ధైర్యమున్నది దానిని దక్కించుకోవటానికేనని
పిరికితనం మన బానిసని 

మడం తిప్పడం చేతకాదని నిరూపిద్దాం

బ్రతుకు అంటే భయం కాదని

భయం ఉంటే అది బ్రతుకు కాదని
నిన్ను నువ్వు తెలుసుకొనుటే జ్ఞానమని

నిన్ను నువ్వు గెలుచుకొనుటే విజయమని నిరూపిద్దాం

ఇంత బ్రతుకు చివరికి మట్టిలోనే అని

మెట్టు మెట్టుకి సంతృప్తే ముఖ్యమని
సోమరికి చరిత్రలో చోటే లేదని

లోకంలో మిగిలేది గట్టి వారేనని నిరూపిద్దాం

ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదని
కష్టం అంటే కల్పితమేనని
నిరూపిద్దాం....నిరూపిద్దాం

జీతం కన్నా జీవితం ముఖ్యమని
ఆస్థి కన్నా అస్తిత్వం మిన్న అని                                        నిరూపిద్దాం....నిరూపిద్దాం

రాతలు మార్చేది రాముడు కాదని
గీతలు మార్చేది గోవిందుడు కాదని
నిరూపిద్దాం....నిరూపిద్దాం

మన ఉహలే మన గీతలని
మన చేతలే మన రాతలని
నిరూపిద్దాం....నిరూపిద్దాం 



-----------------------------------------------------------